కార్తీక మాస పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

శ్రీ కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు, విహార యాత్రల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు విజయనగరం ప్రజారవాణా అధికారిణి జి. వరలక్ష్మి తెలిపారు. ఈనెల 15 నుంచి 22, 29 డిసెంబర్ 6 తేదీ వరకు పంచారామాలు, శ్రీశైలం, శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం 7 రోజులు యాత్ర, పిక్నిక్ కోసం మీరు కోరుకునే ప్రదేశానికి బస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ బస్టాండ్ ని సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕