విజయనగరం చెల్లూరు బైపాస్ రోడ్ లోని కె. వి. ఆర్ రిసార్ట్ లో ప్రముఖ ఉపాధ్యాయుడు ఎస్. వెంకటరమణ మాస్టారు గారి 60వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి. శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారులు, మారుతి ఫ్రెండ్స్ బ్యాచ్, తూర్పు కాపు సామాజిక వేదిక సభ్యులు మజ్జి అప్పారావు, న్యాయవాదులు, మాస్టారు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు.