గజపతినగరంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా

విజయనగరం, గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త కందుల చిన్నయ్యస్వామి ఆధ్వర్యంలో అర్చకులు పీసపాటి శ్రీనివాసచార్యులు పర్యవేక్షణలో వేద పండితులు వేద మంత్రాల నడుమ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వేలాది మందికి అన్న ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్