75 రోజుల మజ్జిగ చలివేంద్రం నిర్వహణ అభినందనీయం: ప్రకాశరావు మాస్టారు

విజయనగరం, ఆదివారం, జూన్ 28న అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడక మైదానంలో నెలవారి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ ఏఎస్ ప్రకాశ రావు మాస్టారు, 75 రోజులు మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. విశిష్ట అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ డివిజి శంకరరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కొత్త సభ్యులు క్లబ్‌లో చేరారు. క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణ అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్