విజయనగరం పట్టణంలో గురువారం తెల్లవారుజామున రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద పార్క్ చేసిన రెండు ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ట్రాన్స్ఫార్మర్స్ ప్రక్కన బస్సులు పార్క్ చేయడంతో ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.