బస్సును ఓవర్టేక్ చేయబోయి.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

వంగర మండలం అరసాడ గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. బస్సును ఓవర్టేక్ చేయబోయిన బైకర్ కు ప్రమాదం జరిగింది. స్థానికులు గాయపడిన వారిని రాజాం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన ఒకరిని శ్రీకాకుళం తరలించారు. గాయపడిన యువకులు రేగిడి మండలం సరసనాపల్లి గ్రామానికి చెందినవారు.

సంబంధిత పోస్ట్