విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో బుధవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవంలో యువకులు వల్లంపూడి ఎస్ఐను జుట్టుపట్టి లాగి, బూతులు తిడుతూ రెచ్చిపోయారు. స్టేజి మీద నృత్యం చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని అడ్డుకోవడంతో దాడి చేశారు.