టాటా ఇండికా కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని విజయనగరం జిల్లా బొడ్డవర చెక్ పోస్టు వద్ద ఎస్. కోట పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. కారులోొ తరలిస్తున్న 70కిలోల గంజాయి, 4 సెల్ ఫోన్లు, రూ 20వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు జిల్లాలో పది ప్రాంతాల్లో ఆకస్మికంగా డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు.