పోషకాహారాన్ని అందించడం, అవసరమైన మందులను సరఫరా చేయడం, సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండాలన్నది మనందరి ధ్యేయం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. దీనికోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 7వ పౌష్టికాహార పక్షోత్సవాల సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు.