విజయనగరం: అత్యాచారం కేసులో నిందితుడికి 12 ఏళ్ల జైలు శిక్ష

విజయనగరం జిల్లా ఆండ్ర పోలీసు స్టేషనులో 2023వ సంవత్సరంలో నమోదైన అత్యాచారంకు పాల్పడిన కేసులో నిందితునికి 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. మెంటాడ మండలం, కుంటినవలస గ్రామానికి చెందిన మాదిరెడ్డి అప్పారావుకి మహిళా కోర్టు జడ్జి ఎన్. పద్మావతి 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 2వేలు జరిమాన విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్