విజయనగరం: అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలి: ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్.డి.పి.ఎస్, పోక్సో, అట్రాసిటీ, లాంగ్ పెండింగు కేసులను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో నిఘా ఏర్పరిచి, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్