రాష్ట్రంలో జమిలి ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం అశోక్ బంగ్లాలో విలేకరులతో మాట్లాడిన ఆయన, మాజీ సీఎం జగన్ జమిలి ఎన్నికలు వస్తాయని చెబుతున్నారని, అలాంటి ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్తారన్న నమ్మకం తమకుందని తెలిపారు.