గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని 9 ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్ నాటికి అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇందుకు రూ.156 కోట్లు మంజూరు చేసి, పనులు ప్రారంభించామన్నారు.