అకస్మాత్తుగా ఏదైనా విపత్తు లేదా అనుకోని ప్రమాదం సంభవించే సమయంలో నిర్వర్తించాల్సిన విధులపట్ల ప్రభుత్వ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేతు మాధవన్ సూచించారు. మంగళవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద వివిధ ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా చేపట్టిన మాక్ డ్రిల్ ను ఆయన పరిశీలించారు.