విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు వారి వాటాను చెక్కుల రూపంలో స్థానిక ఎమ్మెల్యే ఆదితి గజపతి అందజేశారు. ఇంతకుముందు టిడ్కో ఇళ్ల కోసం వాటా చెల్లించినప్పటికీ ఇళ్లు కేటాయించని లబ్ధిదారులకు ఈ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.