కేంద్రీయ విద్యాలయ విజయనగరం లో విద్యాలయ మేనేజ్‌మెంట్ కమిటీ మీటింగ్ జెసి సేతు మాధవన్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో, గత సంవత్సరం పరీక్షలలో, క్రీడలలో విద్యాలయ సాధించిన అత్యుత్తమ ఫలితాలను ఆయన ప్రశంసించారు. విద్యాలయ సాధించిన వంద శాతం ఫలితాలను అభినందిస్తూ, ఈ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశాలు, క్రీడలతో పాటు కెరీర్ గైడెన్స్ పై ప్రత్యేకమైన తరగతులు నిర్వహించాలన్నారు.