విజయనగరం: రెండు చోట్ల పిడుగుల బీభత్సం

విజయనగర జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో తెర్లాం(మ) నందబలగలో పడిన పిడుగులకు 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రాజాం (మ) కంచరాంలో ఒక తాటి చెట్టు కూడా పిడుగుపాటుకు దగ్ధమైంది. జనావాసాల సమీపంలో భారీ శబ్దాలతో పిడుగులు పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్