విజయనగరం: ఉగ్రవాద భావజాలం.. ఇద్దరు యువకులు అరెస్ట్

ఉగ్రవాద భావజాలానికి ప్రభావితులైన ఇద్దరు యువకులను హైదరాబాద్ నుంచి వచ్చిన దర్యాప్తు బృందాలు విజయనగరంలో శుక్రవారం అరెస్ట్ చేశాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టుబడ్డ సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ లను కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు తెలిపారు. ఇంజినీరింగ్ చదివిన సిరాజ్ పేలుడు పదార్థాల తయారీపై ఇంటర్నెట్ లో అధ్యయనం చేసినట్టు గుర్తించగా,, అతనిపై 6 నెలలుగా ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా పెట్టినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్