అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించిన వాకర్స్ క్లబ్ సభ్యులు

విజయనగరంలో శనివారం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. అయ్యన్నపేట జంక్షన్ కూడలిలోని మున్సిపల్ నడక మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త త్యాడ రామకృష్ణారావు (బాలు) మాట్లాడుతూ, అల్లూరి దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అని, గిరిజనుల్లో చైతన్య స్ఫూర్తిని నింపిన విప్లవజ్యోతి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్