ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పతంజలి సంస్థ ముందుకు వచ్చింది. ఫుడ్, హెల్త్ పార్క్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రాజెక్టుల కోసం రూ.370.10 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 22వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనలు వచ్చినా, 2019లో ప్రభుత్వం మారడంతో ఆగిపోయాయి.