AP: 'సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్' జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం 'ఎక్స్' లో ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన దార్శనికుడు ఆయనని కొనియాడారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన అలాంటి మహనీయుడు అని అన్నారు. దేశ సమగ్రతకు మార్గదర్శకుడైన ఆ మహనీయుని ఆత్మస్ఫూర్తికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.