మూలపేట జడ్పీ హైస్కూలు సిబ్బందిని అభినందించిన పవన్‌

AP: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో 7వ తరగతి నుంచి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు లేవని 'నో అడ్మిషన్' బోర్డు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తూ, పాఠశాల సిబ్బందిని అభినందించారు. టీచర్ల బోధన, సిబ్బంది సహకారంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్