భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్ ఫైర్

AP: ప.గో. జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు వచ్చాయి. పవన్‌కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్