AP: పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట, జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల పనులు ఆశించిన స్థాయిలో లేవని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె రోడ్ల స్థితిగతులు ప్రజలకు ముందుగా తెలిసేలా ‘జియో రూరల్ రోడ మేనేజ్‌మెంట్ సిస్టం’ను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లె పండుగ 2.0లో 4,007 కి.మీ. రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాలని అధికారులను సూచించారు.