AP: జులై 26-30వ తేదీ వరకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నాలుగు రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతోపాటు మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉంది.