కేబినెట్ స‌మావేశానికి హాజరైన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (వీడియో)

AP: కేరళలో సుదీర్ఘ చికిత్స అనంతరం తిరిగి మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. గతంలో జూన్ 4, 23 తేదీలలో జరిగిన భేటీల నుంచి మధ్యలోనే వెళ్లిపోవడమే కాకుండా, తదుపరి నాలుగు సమావేశాలకు ఆయన గైర్హాజరయ్యారు. కేరళలో సుమారు నెల రోజుల పాటు ఆయుర్వేద, ప్రకృతి వైద్యం తీసుకున్న అనంతరం రాష్ట్రానికి తిరిగొచ్చిన ఆయన నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕