వైద్యుల సూచన మేరకు, శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి కొనసాగించాలనే కారణంతో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో రెండు వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండనున్నారు. ఆయన మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచే విధులు నిర్వర్తిస్తారు. అయితే, అధికారిక కార్యక్రమాలకు అందుబాటులో ఉంటానని పవన్ కల్యాణ్ తెలిపారు.