స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు వచ్చిన ఆయనకు పోలీసు జాగిలం పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికింది. ఈ సందర్భంగా పవన్ మోకాళ్లపై కూర్చొని జాగిలం నుంచి బొకే తీసుకొని దానికి సెల్యూట్ చేశారు. క్యూట్ వీడియో అంటూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు.