పవన్ కళ్యాణ్ కనీసం మమ్మల్ని పలకరించలేదు: మృతుల కుటుంబీకులు (వీడియో)

AP: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా.. కాకినాడకు చెందిన మణికంఠ, చరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న పిఠాపురం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే పవన్ తమకు 2 నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని మణికంఠ, చరణ్ కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మమ్మల్ని పలకరించనప్పుడు ఎందుకు రమ్మన్నారని ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి పవన్ వెళ్లిపోయారన్నారు.

సంబంధిత పోస్ట్