ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను పక్కన పెట్టిన పవన్! (వీడియో)

AP: తిరుపతి జిల్లా ముక్కాలవారిపల్లెలో జరిగిన వీబీ జీ రామ్ జీ పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. వేదికపై ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న స్థానిక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వేదికపైకి వచ్చినప్పుడు అరవ శ్రీధర్‌ పక్కన నిలబడినా పట్టించుకోలేదు. అతని వైపు పవన్ చూడలేదు. దాంతో అరవ శ్రీధర్‌ను పవన్ పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్