AP: పార్టీ ప్రక్షాళనపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాస్‌ను రెండు నెలల క్రితం బాధ్యతల నుంచి తప్పించింది. అయితే పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు, మర్రెడ్డి సభ్యులుగా ఉన్నారు. మర్రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించి.. ఓదూరి కిషోర్‌ను జనసేన నియమించింది.