AP: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్సీ సీట్లు, రాజ్యసభ ఖాళీల భర్తీపై చర్చలు జరపనున్నారు. అలాగే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపైనా చర్చించనున్నారు.