కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్‌ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బుధవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. కృష్ణమీనన్‌ మార్గ్‌లోని హోంమంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, ఏపీలోని పలు అంశాలు, ప్రజా, పరిపాలనా ప్రాధాన్య విషయాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా, ఉప్పాడ సముద్రకోత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను సమర్పించడానికి కాకినాడ జిల్లా అధికార యంత్రాంగానికి అవకాశం కల్పించినందుకు పవన్‌ కల్యాణ్‌ అమిత్‌ షాకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్