డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి జనసేనాని బయల్దేరి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పవన్ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లనున్నారు.