AP: పవన్ కళ్యాణ్ రాజకీయాలు అవకాశవాదంతో కూడుకున్నవని మాజీ మంత్రి, వైసీపీ నేత శైలజానాథ్ విమర్శించారు. ఇచ్చిన మాట మీద నిలబడని వ్యక్తి పవన్ అని, సంక్షేమ పథకాలపై ఆయన విమర్శలు దీనికి నిదర్శనమన్నారు. శనివారం తాడేపల్లిలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సంతకాలు పెట్టిన బాండ్లు పంపిణీ చేసినప్పుడు పవన్‌కు సంక్షేమ పథకాలపై ఎందుకు తెలియలేదని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో ఇన్ని వేరియేషన్స్ చూపించే నాయకుడని, ఆయన యువతను పెడదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.