నేడు ఉప్పాడలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలపై చర్చించేందుకు ఉదయం కాకినాడ కలెక్టరేట్‌లో మత్స్యకారుల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలతో ఆయన సమావేశమవుతారు. మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, రాయవరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్