నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎలా ఇబ్బంది పెట్టిందో చంద్రబాబు వివరించారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీదు పడుకుని నిరసన తెలిపిన అప్పటి ఫోటోను చూసి పవన్ నవ్వుకున్నారు.