AP: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోమవారం పర్యటించనున్నారు. సుందరగిరిపై కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామికి పూజలు చేసి, అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేయనున్నారు. గ్రామంలో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్‌ను పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏర్పాట్లను పరిశీలించారు.