AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన భీమవరం డీఎస్పీ జయసూర్యకు కేంద్రం అవార్డు ఇచ్చింది. మృతదేహం డెలివరీ కేసు విషయంలో జయసూర్యతో పాటు మరో ముగ్గురికి కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించింది. ఎస్పీ నయీం, ఏసీపీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, ఎస్‌ఐ నజీరుల్లా ఈ అవార్డు అందుకున్నారు. కాగా, పేకాట శిబిరాలను ప్రోత్సాహిస్తున్నట్లు, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు డీఎస్పీ జయసూర్యపై పవన్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.