కాకినాడ జిల్లాలో భారీవర్షాలపై పవన్‌ సమీక్ష

AP: కాకినాడ జిల్లాలో భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రోడ్లపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని సూచించారు. నీటి నిల్వలు లేకుండా డీవాటరింగ్ చేయాలని, తక్షణం పంటనష్టం అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని, ఆస్తి నష్టం జరిగిన చోట పరిహారం అందించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్

✕
✕