పిఠాపురం నియోజకవర్గంలో శాంతిభద్రతలపై పవన్ సమీక్ష

పిఠాపురం అభివృద్ధిపై శాంతిభద్రతల పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఫోకస్‌ పెట్టారు. పిఠాపురం పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల మూలంగా పోలీస్ శాఖ చులకన అవుతోందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ ఆదేశించారు. ప్రతివారం పిఠాపురం అభివృద్ధిపై సమీక్ష చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్