మత్స్యకార యువతకు పవన్ గుడ్ న్యూస్

AP: మత్స్యకార యువతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. స్పీడ్ బోటింగ్, స్కూబా డైవింగ్ తదితర జల క్రీడల్లో మత్స్యకార యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. తీర ప్రాంతాలను టూరిజం హాట్ స్పాట్లుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. తీర ప్రాంత మత్స్యకారులు వేటతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపైనా దృష్టి సారించాలన్నారు. అందుకోసం కాకినాడ తీర ప్రాంతం నుంచి కొంత మంది మత్స్యకారులను కేరళకు తీసుకెళ్లి అక్కడ ఎకో టూరిజం స్పాట్ల వద్ద శిక్షణ ఇప్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్