పవన్ పర్యటన.. జనసేన మహిళా నేతకు గాయం (వీడియో)

AP: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వేళ జనసేన మహిళా నేత చల్లా లక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. సంక్రాంతి సంబరాల వద్ద ఆమెకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు బయటకు పంపారు. దాంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో చల్లా లక్ష్మి కిందపడటంతో తలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై జనసేన వీర మహిళలు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్