AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శనివారం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు ఉన్నాయని, కండరాలు పూర్తిగా చిట్లడంతో శస్త్రచికిత్స అవసరమని ఇటీవల వైద్యులు సూచించారు. రెండు భుజాలకూ ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇవాళ కుడి భుజానికి చేశారు. పవన్ ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.