కాసేపట్లో చంద్రబాబుతో పవన్ భేటీ.. నాగబాబు మంత్రి పదవిపై చర్చ!

ఏపీ సచివాలయంలో నేడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. బ్లాక్-1లో మధ్యాహ్నం 3 గంటలకు వీరు సమావేశం కానున్నారు. జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి, ఏ శాఖ అప్పగించాలనే అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా నాగబాబుతో నాలుగో స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్