రేపు పల్నాడు జిల్లాకు పవన్.. సరస్వతి పవర్ భూముల పరిశీలన

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. జగన్‌కు చెందిన సరస్వతి పవర్ భూములను ఆయన పరిశీలించనున్నారు. మాచవరం మండలంలో సరస్వతి పవర్‌కు కేటాయించిన 1515.93 ఎకరాల్లో అటవీ భూములు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ భూములపై పవన్ ఫోకస్ పెట్టారు. అటవీ అధికారులు సర్వే అనంతరం నివేదికను పవన్‌కు అందజేశారు. దీంతో
ఆయన భూములను పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్