లేడీ డాన్‌ నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్‌ నమోదు

నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ అరుణపై పోలీసులు ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్ట్‌ నమోదు చేశారు. గత ప్రభుత్వంలో అనేక నేరాలకు పాల్పడిన అరుణపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీసు స్టేషన్లతో పాటు విజయవాడలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసు నమోదైంది. ఎస్పీ అజిత వేజెండ్ల ప్రతిపాదనల మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా అనుమతితో అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేసి, నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్