AP: రాజధాని అమరావతిలో భూముల్లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూముల్లేని 1,575 పేద కుటుంబాలకు పెండింగ్ లో ఉన్న పెన్షన్ ను కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. దీంతో రాజధాని అమరావతిలో భూముల్లేని 1,575 పేద కుటుంబాలు పెన్షన్లు పొందనున్నాయి. కాగా గత వైసీపీ ప్రభుత్వం వీరికి పెన్షన్లు రద్దు చేసిందని ఆమె పేర్కొన్నారు.