AP: త్వరలో 90 వేల మంది HIV బాధితులకు నెలకు రూ.4వేల చొప్పున పెన్షన్లు ఇస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2030 నాటికి ఏపీని హెచ్‌ఐవి రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి అన్నారు. రాష్ట్రంలో హెచ్‌ఐవి పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గిందని, అయితే కొత్త కేసుల్లో ఐటీ ఉద్యోగుల ఉనికి ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం 42వేల మంది హెచ్ఐవి బాధితులకు నెలకు రూ.4వేల చొప్పున పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.