AP: అమరావతిలో భూమిలేని పేదలు, తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు లేని అనాథ మైనర్లకు నెలకు రూ.5 వేల చొప్పున పింఛన్లు అందించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. గతంలో నిలిచిపోయిన భూమిలేని పేదల పింఛన్లను పునరుద్ధరించి, అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పింఛన్లకు సంబంధించి త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.